మెగా అభిమాని ఎంతకు తెగించాడో తెలుసా

Maga Star Fan Cuts His Throat For Not Getting Khaidi No 150 Movie Tickets

10:52 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Maga Star Fan Cuts His Throat For Not Getting Khaidi No 150 Movie Tickets

అభిమానం హద్దులు దాటవద్దని పదే పదే సినీ హీరోలు చెబుతున్నా సరే పరిస్థితిలో మార్పు లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానులైతే మరీను. ఎందుకంటే, సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేదో దాదాపు అందరికీ తెల్సిందే కదా. అయితే 9ఏళ్ళ విరామం తర్వాత చిరు సినిమా విడుదలవుతున్నా అదే స్థాయిలో కొన్నిచోట్ల పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తాజాగా బుదవారం విడుదలయిన చిరంజీవి 150వ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద ఒక అభిమాని చేసిన పని అందరికీ షాకిచ్చింది.

విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్దకు ఒక అభిమాని చిరంజీవి సినిమా చూడటానికి వచ్చాడు. అయితే అతడికి టిక్కెట్ దొరకలేదు. దీంతో తీవ్ర మనోవేదనతో పాటు ఆగ్రహానికీ గురైన ఆ అభిమాని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీన్ని అభిమానం అనాలా లేక పిచ్చి పని అనాలా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... ఆ సమయంలో ఈ అభిమాని మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో అప్పటికే టిక్కెట్ దొరకలేదని వీరంగం ఆడుతూ ఆడుతూ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దాంతో మెడకు గాయమై రక్తమోడుతున్న అతన్ని ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఇదే క్రమంలో అతనిని ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి అక్కడున్నవారంతా ఎంత ప్రయత్నించినా అతడు అంగీకరించలేదు సరికదా... తనకు టిక్కెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళతానని లేకుంటే ఇక్కడే చచ్చిపోతానని మాట్లాడటం మొదలుపెట్టాడు! ఈ మూర్ఖపు వాదన అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆ అభిమానిని అదుపు చేసారు. ఇలాంటి అభిమానాన్ని ఏమనాలి ?

ఇవి కూడా చదవండి: ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఆ సినీ నటి మరణం .. అనుమానాస్పదం

English summary

Mega Star Chiranjeevi's Khaidi No.150 movie was released yesterday and one of fan of chiru was got angry for not getting tickets and he cut off his throat with blade for not getting tickets.