మళ్లీ మార్కెట్ లోకి   మ్యాగి న్యూడిల్స్ 

Maggi Noodles Back In Stores

05:56 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Maggi Noodles Back In Stores

చిన్న పిల్లలు అమితంగా ఇష్టపడే మ్యాగి న్యూడిల్స్ అమ్మకాలు ఐదు నెలల తరువాత తిరిగి ప్రారంభం అయ్యాయి. అత్యధిక మోతాదులో సీసాన్ని వాడుతున్నారన్న కారణంగా మ్యాగి న్యూడిల్స్ ను ఇండియాలో నిషేదించిన సంగతి తెలిసిందే. దీంతో 30,000 టన్నుల మ్యాగి ఉత్పత్తిని నెస్లే సంస్థ వెనక్కి తీసుకుంది. అనేక పరీ క్షలు నిర్వహించిన అనంతరం బోంబే హైకోర్ట్ బ్యాన్ ను ఎత్తివేసింది. దీంతో ఇండియాలో మ్యాగి అమ్మకాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మ్యాగి న్యూడిల్స్ ను 8 రాష్ట్రాలు నిషేదించాయి.
మిగిలిన రాష్ట్రాలలో మ్యాగిని బ్యాన్ చెయ్యలేదని నెస్లే సంస్థ పేర్కొంది. అంతే కాక అన్ లైన్ సంస్థ స్నాప్ డీల్ తో మ్యాగి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.

నెస్లే ఇండియా చైర్మన్ సురేష్ నారాయణన్ మాట్లాడుతూ ఈ పవిత్రమైన దీపావళి సీజన్లో వినియోగదారులకు ఎంతో ఇష్టమైన మ్యాగి ను తిరిగి అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

English summary

Maggi Noodles Back In Stores