మాల్యాను చంపబోయి మాగుంటను చంపేసారన్న నారాయణ

Magunta Subbirami Reddy Killed Instead Of Vijay Mallya Says CPI Narayana

04:39 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Magunta Subbirami Reddy Killed Instead Of Vijay Mallya Says CPI Narayana

సంచలన ప్రకటనలు చేయడంలో సిపిఐ నేత నారాయణ రూటే వేరు. రాజకీయాల్లోకి వస్తే , ఏమైనా అంటాం , ఏదైనా అంటాం అనే శ్రీశ్రీ సూక్తిని బానే వంట బట్టిన్చుకున్నారీయన. తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేసారు. విజయ్ మాల్యాను నక్సలైట్లు చంపాలని ప్రయత్నించి...వీలుకాక పోవడంతో మాగుంట సుబ్బిరామిరెడ్డిని చంపారని నారాయణ సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ , విజయ్‌మాల్యాకు, మాగుంట కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. విజయ్‌మాల్యాకు కేంద్రం సహకరించిందని నారాయణ ఆరోపించారు.బ్యాంకర్లకు, మాల్యాకు మధ్య గతంలో కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందని ఆయన ద్వజమెత్తారు . దేశంలో బ్లాక్‌మనీ గ్యాంగ్‌లు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. దొంగడబ్బును బంగారంగా మారుస్తున్నారని నారాయణ విమర్శించారు.

English summary

CPI party leader Narayana was famous for his way of responding to the issues. Recently in a press meet in Nellore he says that Naksals killed Magunta subbirami Reddy instead of Vijay Mallya because Magunta have connections with Vijay Mallya.