ర్యాంప్ వాక్ లో సీఎం వైఫ్

Maharashtra Chief Minister Devendra Fadnavis Wife In New York Fashion Week

10:38 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Maharashtra Chief Minister Devendra Fadnavis Wife In New York Fashion Week

ఇదేమిటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య ఇలా ర్యాంప్ వాక్ లో పాల్గొనడం ఏమిటి అని ఆశ్చర్య పోవడం సహజమే. నిజంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ ర్యాంప్ వాక్ కి రెడీ అవుతున్నారు. అయితే ఇది ఓ మంచి ఉద్దేశం కోసం చేస్తున్న పని. మంచి ఉద్దేశం గురించి జనాల్లో అవగాహన, ప్రచారం కల్పించేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారిని అభినందించక తప్పదు.

అలాంటి సదుద్దేశంతోనే ర్యాంప్ వాక్ లో పాల్గొనబోతున్నారు. బాలికా విద్యపై అవగాహన, చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేందుకు అమెరికాలోని న్యూయార్క్ లో జరగనున్న ఫ్యాషన్ వీక్ లో ఆమె పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన చాసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ తరఫున జరిగే ఫ్యాషన్ షోలో ఆమె షో స్టాపర్ గా ర్యాంప్ పై నడవనున్నారు. ఈ షో న్యూయార్క్ లో గురువారం జరగనుంది. ఈ షోలో ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన చేనేత వస్త్రాలను అమృత ధరించనున్నారు.

బాలికా విద్యపై అవగాహన పెంపొందించడానికి తాను ఈ ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు అమృత ఫడ్నవిస్ వెల్లడించారు. కుటుంబంలో ఆడపిల్లను ఎడ్యుకేట్ చేయడమంటే కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయడమని, కుటుంబమంతా చదువుకున్న వాళ్లయితే దేశం మునుముందుకు సాగుతుందని తాను బలంగా నమ్ముతానని ఆమె చెప్పారు. అమృత గతంలో కూడా గిరిజన కళలు, చేనేత వస్త్రాల కోసం డిజైనర్ హేమంత్ త్రివేది రూపొందించిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు. బ్యాంకు ఉద్యోగి అయిన అమృత నాగ్ పూర్ లోని సెక్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. తనకుంటూ సొంత గుర్తింపు ఉండాలన్న ఆలోచనకు తన భర్త పూర్తి సహకారం అందిస్తున్నారని కూడా అమృత ఫడ్నవిస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:బాలయ్య రాజసూయ యాగం ...

ఇవి కూడా చదవండి:12జీబీ ర్యామ్, 1టీబీ మెమరీ, 20 మెగా పిక్సెల్ కెమెరా.. సంచలనానికి తెర తీసిన సరికొత్త స్మార్ట్ ఫోన్!

English summary

Maharashtra Chief Minister Devendra Fadnavis wife was going to do Ramp Walk in Newyork Fashion week for good cause. She was going to promote Handmade Clothes and the importance of Women Education.