గిన్నీస్‌బుక్‌‌లోకి గోల్డ్ మేన్

Maharashtra Man With Golden Shirt Into Guinness World Records

10:09 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Maharashtra Man With Golden Shirt Into Guinness World Records

సాధారణంగా బంగారం పై మమకారం లేనివాళ్ళు ఎవరూ ఉండరు. అయితే బంగారం పై ఆయనకున్న మమకారం ఏకంగా బంగారుచొక్కా తయారుచేయించుకుని ధరించేలా చేసింది.ఎన్టీఆర్ నటించిన గజదొంగ చిత్రంలో గోల్డ్ మేన్ పాట విన్నాం కదా. కానీ ఇక్కడ ఈయన నిజంగా గోల్డ్ మేన్ అయ్యారు. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నివ్వడమే కాదు, ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే, గోల్డ్‌మేన్ అని సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే మహారాష్ట్రకు చెందిన 47ఏళ్ల పంకజ్ పరేఖ్ కోటిన్నర రూపాయల విలువ చేసే 4.10 గ్రా. కేజీల బంగారు చొక్కా ఓనర్ గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి: మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

గిన్నీస్ రికార్డ్ విషయం తెలుసుకున్న పరేఖ్ తనకు అస్సలు నమ్మశక్యంగా లేదంటూ పరేఖ్ సంతోషం వ్యక్తం చేశాడు. చిన్న గ్రామంలో జన్మించిన తనకు ఈ గిన్నిస్ రికార్డు తో ప్రపంచవ్యాప్తంగా తన గ్రామానికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పరేఖ్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. పాతికేళ్ల క్రితం తన పెళ్లిలో పెళ్లి కూతురికంటే ఎక్కువ బంగారం ధరించి అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేశారు పరేఖ్. ఆ మధ్య ఈ గోల్డ్ మాన్ హైదరాబాద్ లో సందడి చేసిన సంగతి తెలసిందే. హిమాయత్ నగర్ లో జరిగిన ఓ వేడుకకు గోల్డ్ షర్ట్ తో హాజరై అందర్నీ ఆకర్షించారు. మొత్తానికి ఈ గోల్డ్ మేన్ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

English summary

Maharashtra Businesss Man and Politician Pankaj Parakh enters into Guinness World recrods For wearing Gold Shirt. recently this Man Came to Hyderabad fora function by wearing Gold Shirt worth One and Half Crore.