కరువు ప్రాంతంలో మంత్రి గారి జల్సా

Maharashtra Minister wasted 10000 Litres Of Water For Helipad

12:10 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Maharashtra Minister wasted 10000 Litres Of Water For Helipad

తాగటానికే గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే.. మంత్రి హెలికాప్టర్‌కు అవసరమైన హెలిప్యాడ్‌ కోసం ఏకంగా పదివేల లీటర్ల మంచినీటిని తగలేశారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన నేపధ్యంలో మంత్రిగారి జల్సా పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాతూర్‌ జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనటంతో.. పరిస్థితిని సమీక్షించటానికి రెవెన్యూమంత్రి ఏక్‌నాథ్‌ఖడ్సే శుక్రవారం ఆ జిల్లా పర్యటనకు హెలికాప్టర్‌లో వెళ్లారు. లాతూర్‌కు 40 కి.మీ.ల దూరంలోని బెల్కుండ్‌ గ్రామానికి మంత్రి రానున్నారని తెలిసి, అధికారులు అక్కడ తాత్కాలిక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇక నేలను చదును చేయడానికి ఏకంగా 10 వేలకుపైగా లీటర్ల మంచినీటిని వాడేసారు.

ఇవి కూడా చదవండి: పవర్ స్టార్ కి బీర్లతో అభిషేకం!

నీటిఎద్దడి కారణంగా లాతూర్‌కు రైలువ్యాగన్ల ద్వారా మంచినీళ్లను సరఫరా చేస్తున్న తరుణంలో.. అధికారులు నీళ్లను ఈ విధంగా దుర్వినియోగం చేయటంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంత్రిని విలేకర్లు ప్రశ్నిస్తే . ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు పదివేల లీటర్ల నీటిని వాడలేదని, దమ్మూధూళి లేవకుండా ఉండేందుకు ఏదో నామక కొన్ని లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించారని సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష ఎన్‌సీపీ మాత్రం ఈ ఘటనపై తీవ్రంగా విరుచుకుపడింది. భాజపా ప్రభుత్వ నిర్లక్షధోరణికి, అహంకారానికి ఇది నిదర్శమని ఆరోపించింది. మంత్రి లాతూర్‌లో ఉన్న విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బెల్కుండ్‌కు రోడ్డుమార్గంలో వెళ్తే సరిపోయే దానికి , ఇంత నీరు వృధా చేయడం ఎందుకని నిలదేస్తున్నారు. ఎవరేమన్నా దులిపేసుకు పొతే, సరిపోతుందిగా అన్నట్టు ఉంది మంత్రి గారి వ్యవహారం.

అంతేకాకుండా ట్విట్టర్ స్పందించిన మంత్రి గారు హెలి ప్యాడ్ కు ఉపయోగించిన నీరు మరల సుద్ది చెయ్యడానికి వీలు లేని నీరని సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి:

కన్న కూతురికి విషమిచ్చి చంపేశారు

తల్లీ బిడ్డను మింగేసిన వాషింగ్ మెషిన్

సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

English summary

Maharashtra Minister Eknath Khadse wasted 10,000 litres of water for his helipad. This was severly opposed by Opposition parties in Maharashtra. Bur this minster said that they have used the water which cannot be recycled again.