నిను వీడను నేను ..... 

Maharastra Govt To Appeal Hit And Run Case In Supreme Court

05:19 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Maharastra Govt To Appeal Hit And Run Case In Supreme Court

సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని హిట్ అండ్ రన్ కేసు వీడినట్లు లేదు. ఇటీవల బాంబే హైకోర్టు నుంచి నిర్దోషిగా విడుదలైన ఇతగాడికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పుష్కర కాలానికి పైగా సాగిన హిట్ అండ్ రన్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోగా మహారాష్ట్ర సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం కండల వీరుడికి కునుకు పట్టనీయడం లేదని అంటున్నారు. వివరాలోకి వెళితే ఈ కేసులో హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యం తాగి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి మరణానికి సల్మాన్ కారణంగా ఆరోపణలు రావడం, దీని పై నమోదైన కేసులో సుదీర్ఘ విచారణ జరిగాక.. ఇటీవలే. బాంబే హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించడం తెల్సిందే. సల్మాన్ నేరం చేసినట్లుగా నిరూపించే ఆధారాల్ని చూపించటంలో విఫలమయ్యారంటూ కోర్టు ప్రకటిస్తూ, నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సోషల్ మీడియాలో అయితే సల్మాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్ అయ్యాయి. మొత్తం మీద కారణం ఏదైనా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్లాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి సుప్రీం కి కేసు చేరితే , పరిణామాలు ఎలా ఉంటాయోనని సల్మాన్ కె కాదు , సంబరాలు చేసుకున్న అభిమానులకూ అనిపించడం సహజమేగా. ఏమౌతుందో చూద్దాం.

English summary

Maharashtra government to appeal bombay courts Judgment in Supreme Court on Hit and Run case . Recently Bombay Court said that Salamn Khan was not accused in that case and now maharashtra government moving forward in that case and it is going to appeal in Supreme Court