మాహాత్మా గాంధీ పేరిట గ్రామం

Mahatma Gandhi VIllage In Visakha District

11:34 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Mahatma Gandhi VIllage In Visakha District

అవును మాహాత్మ గాంధీ నడయాడిన ప్రదేశం కనుక అందుకు గుర్తుగా ఆ ఊరి పేరునే గాంధీ పేరుతో ఏర్పాటుచేసుకున్నారు. ఇది ఎక్కడ అంటే, వివరాల్లోకి వెళదాం. స్వాతంత్య్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో జాతిపిత బాపూజీ నడయాడిన ప్రాంతాలన్నీ ఏవో ఒక విశిష్టత సంతరించుకున్నాయి. స్వాతంత్య్ర పోరాటంపై దేశవ్యాప్తంగా తిరిగి ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన గాంధీజీ విశాఖ జిల్లా చోడవరం ప్రాంతంలోనూ సంచరించారు. మహాత్ముడు చోడవరం ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న గాంధీ గ్రామం పంచాయతీ స్థలంలో కొంతసేపు విశ్రమించారు. ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన అడుగులు వేసిన ప్రాంతంలో ప్రత్యేకం గ్రామం నిర్మించుకుని దానికి గాంధీ గ్రామంగా పేరు పెట్టారు.

ఒకప్పుడు అంకుపాలెంలో కలిసి ఉండే ఈ గ్రామం తరువాత ప్రత్యేకంగా గాంధీ గ్రామంగా రూపుదిద్దుకుంది. దేశానికి స్వాతంత్య్ర వచ్చిన ఏడాదే ఈ గ్రామం కూడా ఏర్పడింది. నాడు వెలసిన చిన్న గ్రామం నేడు మేజర్ పంచాయతీగా రూపుదిద్దుకుంది. గ్రామానికి ముంగిటే జాతిపిత విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తమ భక్తి ప్రవత్తులను చాటుకుంటున్నారు.

ఇక అప్పట్లో పశువులు ఉంచే ఓ బందెల దొడ్డిగా ఉండేది. అప్పట్లో ఆ బందెల దొడ్డి విశాలంగా ఉండడంతో ఆ ప్రదేశంలోనే గాంధీజీ సభ నిర్వహించారు. గాంధీ ప్రసంగం వినడానికి మారుమూల పల్లెల నుంచి ఎడ్ల బళ్లు కట్టుకుని వచ్చినట్టు పెద్దలు చెబుతారు. నాడు గాంధీ సభ నిర్వహించిన ప్రదేశంలోనే ప్రస్తుతం ప్రేమ సమాజం నిర్మించి, ఎంతోమంది అనాధలకు అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఒబామా డాటర్ ఇలా దొరికేసింది (వీడియో)

ఇవి కూడా చదవండి:కువైట్ లో నౌకర్ పై చిత్ర హింసలు(వీడియో)

English summary

Freedom Fighter Mahatma Gandhi was also known as the Father of our Indian Nation. He visited so many places around India during freedom fight struggle. Once upon a time he visited a Village in Visakha District and the Villagers named that village as Mahatma Gandhi and the villagers also doing social welfare programs in that village.