హర్భజన్ సింగ్ పై ధోని అభిమానులు దాడి

Mahendra Singh Dhoni fans attacks Harbhajan Singh office

03:14 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Mahendra Singh Dhoni fans attacks Harbhajan Singh office

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన అందరు కెప్టెన్లకూ అభిమానులు ఉన్నారు. అయితే భారత జట్టు విజయాల పరంగానే కాకుండా.. ఐసీపీ ప్రపంచ కప్ లను అందించిన వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే అందరిలోకి బెస్ట్ కెప్టెన్. ఇదే ధోనీకి అంతులేని అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా.. నిన్న టీమిండియా కెప్టెన్ గా తనదైన శైలిలో రాణించి ప్రశంసలు అందుకున్న సౌరవ్ గంగూలీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడిని టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ గా అభివర్ణించాడు. దీనిపై కెప్టెన్ ధోని.. పట్టించుకోలేదు.

అయితే.. అతడి అభిమానులు మాత్రం దానిని జీర్ణించుకోలేకపోయారు. సహనం ఉన్న కొందరు భజ్జీ కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు సంధిస్తే... కాస్తంత క్షణికావేశంతో ఊగిపోయిన ధోని అభిమానులు.. ఏకంగా హర్భజన్ సింగ్ కార్యాలయంపై దాడికి దిగారు. ఇప్పుడు ఈ దాడి పై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

English summary

Mahendra Singh Dhoni fans attacks Harbhajan Singh office