మలయాళంలో అడుగు పెడుతున్న మహేష్

Mahesh Aagadu in Malayalam

01:29 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Mahesh Aagadu in Malayalam

సూపర్స్టార్ మహేష్ హీరో గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఆగడు'. ఈ సినిమా 2014 లో విడుదలైంది. ఈ సినిమా ను ఈ వారంలో మలయాళంలో విడుదల చెయ్యడానికి సిద్ధం చేశారు. 'పోకిరి పోలీస్' అనే టైటిల్ తో మలయాళంలో ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు. బాగా పేరుగాంచిన పంపిణీ దారుడు భద్రకాళి ప్రసాద్ ఈ సినిమా ని విడుదల చేస్తున్నాడు. గతంలో మహేష్ నటించిన 'శ్రీమంతుడు' తమిళ వర్షన్ 'సెల్వందన్', '1 నేనొక్కడినే' సినిమా మలయాళ వర్షన్ లు కేరళ లో కూడా కొంత మంది అభిమానులను సంపాదించాడు. కేరళ లో మహేష్ కి క్రేజ్ ఉండటంతో 'ఆగడు' మలయాళ వర్షన్ ను భద్రకాళి ఫిల్మ్స్ పెద్ద ఎత్తున ఈ శుక్రవారం విడుదల చేస్తుంది.

తమన్నా హీరోయిన్ గా మహేష్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో రావడంతో ఈ సినిమా తెలుగు లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ సినిమా గా నిలిచింది. తెలుగులో పరాజయం పొందిన ఈ సినిమా మలయాళంలో హిట్ సాధిస్తుందో లేదో.

English summary

Super Star Mahesh Babu Aagadu movie released in 2014 year. This movie directed by Sreenu Vaitla. Tamanna romanced with Mahesh in this film. Hot beauty Shruti Hassan appeared in one item song in this movie. Now this movie is releasing in Malayalam with Pokiri Police title.