బన్నీ మహేష్‌లకు పోటీగా త్రివిక్రమ్‌

Mahesh and Bunny Competition with Trivikram

02:58 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Mahesh and Bunny Competition with Trivikram

ఈ సమ్మర్‌లో రిలీజ్‌ కి చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి. బడా హీరోలంతా సమ్మర్‌ సీజన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ సినిమా రిలీజ్‌ డేట్స్‌ని లాక్‌ చేసి పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది పోటీపడాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు.

 వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్‌ మొదటిసారిగా మిడిల్‌ రేంజ్‌ హీరోతో తెరకెక్కించిన చిత్రం అ...ఆ... ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు  దర్శకత్వం వహించగా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నితిన్‌ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అవాల్సిఉన్నా షూటింగ్‌ పూర్తి అవకపోవడంతో రిలీజ్‌ చేయడానికి ఆలస్యం అయింది.

తాజాగా అ...ఆ... చిత్రాన్ని ఏఫ్రిల్‌ 22న రిలీజ్‌ చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్‌. కానీ అదే టైంకి బన్నీ నటించిన సరైనోడు చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉండడంతో త్రివిక్రమ్‌ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే బన్ని, త్రివిక్రమ్‌ మంచి స్నేహితులు కావడంతో పోటీకి సిద్దంగా లేడు త్రివిక్రమ్‌. దీని కారణంగానే ఈ సినిమాని రెండు వారాలు వాయిదా వేయాలని అనుకుంటున్నాడు.  

అయితే వాయిదా సాద్యం అయ్యేలా లేదు. ఎందుకంటే మే 8న మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మూత్సవం రిలీజ్‌కి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించేసారు. అందువల్ల అనుకున్న టైంకి ఆలస్యం అయితే అటు బన్నీతో గానీ ఇటు మహేష్‌తో గానీ పోటీ తప్పదు.

1/5 Pages

అ...ఆ... చిత్రాన్ని ఏఫ్రిల్‌ 22న రిలీజ్‌ చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్‌

English summary

Mahesh and Bunny Competition with Trivikram