దటీజ్ మహేష్

Mahesh Babu About IIFA Awards

11:07 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Mahesh Babu About IIFA Awards

సాదారణంగా ఓ అవార్డు వస్తేనో , ఓ సన్మానం జరిగితెనో ఇదంతా తన ఘనతే అని చెప్పుకోవడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ వేరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి , ఎవరికీ దక్కాల్సిన క్రెడిట్ వారికే దక్కేలా చేస్తాడు. తన వినమ్రత చాటుకుంటాడు. తాజాగా మరోసారి అది రుజువుచేసుకున్నాడు. మహేష్ ఐఫా ఉత్సవాల్లో శ్రీమంతుడు చిత్రానికి మహేశ్‌బాబుకు ఉత్తమ కథానాయకుడు అవార్డు పొందాడు. అయితే దీనికి మహేశ్‌బాబు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. దర్శకుడు కొరటాల శివ లేనిదే ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని వ్యాఖ్యానించాడు. అదే విధంగా తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అందుకే మహీ అంటే అభిమానులకే కాదు అతనితో పనిచేసే ప్రతిఒక్కరికీ సొంతొషంగా ఉంటుందని వినికిడి. దటీజ్ మహేష్.

కాగా శ్రీమంతుడు చిత్రానికి మొత్తం ఆరు అవార్డులు లభించాయి. శ్రీమంతుడు చిత్రానికి ఉత్తమ నటుడు – మహేష్ బాబు , ఉత్తమ నటి – శృతి హాసన్, ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు, ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి , ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సాగర్ అవార్డులు అందుకున్న సంగతి తెల్సిందే.

English summary

Super Star Prince Mahesh Babu movie Srimanthdu won 6 awards for his movie which was directed by Koratala Shiva.Mahesh Babu Responds to his awards and he says that the credit goes to director koratala Shiva