నెల తర్వాత ట్విట్టర్ లో తేలిన మహేష్

Mahesh Babu actived after 1 month

06:33 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Mahesh Babu actived after 1 month

భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మోత్సవం మహేష్ నే కాదు ఆయన అభిమానులను సైతం నిరాశ పరిచింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా విడుదల ముందు వరకు ట్విట్టర్ వేదికగా ఎంతో చురుగ్గా కనిపించిన సూపర్స్టార్ ఆ తర్వాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. మొత్తానికి నెల తర్వాత బ్రహ్మోత్సవం అపజయం నుంచి కోలుకున్న మహేష్ ట్వీట్ చేయడం మొదలెట్టాడు. తాజాగా ఈనెల 18న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో శ్రీమంతుడు చిత్రంలో నటనకు మహేష్ ను ఉత్తమనటుడి అవార్డు వరించింది. దీంతో ఆయన దాదాపు నెలరోజుల తర్వాత ట్విట్టర్లో స్పందించాడు.

ఉత్తమనటుడిగా తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెల్పాడు. తాను ఈ ఘనత సాధించడానికి ప్రోత్సహించిన అభిమానులకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం పై విచారం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్బాబు మాంచి హిట్ ని అభిమానులతో పంచుకోవాలని ఉవ్విళూరుతున్నాడు.

English summary

Mahesh Babu actived after 1 month