ఇక అంతా రాత్రి వేళల్లోనేనట

Mahesh Babu And Murugadoss Movie Shoot Begins

10:52 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Mahesh Babu And Murugadoss Movie Shoot Begins

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబో లో శుక్రవారం నుంచి న్యూ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. ఓ సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ తో బాటు గుజరాత్, ముంబై, చెన్నై, పూణే లలో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తీస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

సాధ్యమైనంత వరకు వచ్చే డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని టీమ్ చెబుతోంది. వారం రోజుల పాటు ఇలా రాత్రుళ్ళు కొన్ని సీన్స్ షూట్ చేస్తారట.

ఇవి కూడా చదవండి:తిమింగలంతో కలిసి హీరోయిన్ స్విమ్మింగ్

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ 'మురారి' పాటపై రచ్చరచ్చ.. గతం తవ్విన కృష్ణవంశీ

English summary

Tollywood Super Star Mahesh Babu was presently signed to a bilingual movie with Tamil Director A.R.Murugadoss and now this movie shooting was started by the movie unit and the movie unit was planning to release this movie on Next year "PONGAL".