మహేష్-మురగదాస్ చిత్రం టైటిల్ ఇదే!

Mahesh Babu and Murugadoss movie title

03:19 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Mahesh Babu and Murugadoss movie title

'బ్రహ్మోత్సవం' చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హాట్ బికినీ బేబీ పరిణీతి చోప్రా దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. భారతీయ న్యాయవ్యవస్థ నేపథ్యంలో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్నఈ చిత్రాన్ని జూలై 15న అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు.

హైదరాబాద్, చెన్నై, పూనే, రాజస్థాన్ లలో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి పలు టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. తాజాగా ఈ చిత్రానికి 'వాస్కోడగామ' అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తుందని తెలిసింది. దీంతో పాటు ఈ సినిమా తమిళ వెర్షన్ కు మహేష్ తొలిసారి డబ్బింగ్ చెప్పబోతుండటం విశేషం. మురుగదాస్ చిత్రాలకి ఎక్కువగా మ్యూజిక్ అందించే హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary

Mahesh Babu and Murugadoss movie title