వాళ్ళ కోసం మహేష్‌, ఎన్టీఆర్‌ కలిసి పని చేస్తారట

Mahesh Babu and Ntr working together for Memu-Saitham

12:31 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu and Ntr working together for Memu-Saitham

అవును మీరు చూసింది నిజమే. మహేష్‌-ఎన్టీఆర్‌ కలిసి పని చేయబోతున్నారు. కానీ ఇదంతా సినిమా కోసం కాదు. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము-సైతం' అనే ఛారిటీ కార్యక్రమం కోసం. మంచులక్ష్మీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు సామాన్య ప్రజల్లా మారి, కష్టపడి పని చేసి డబ్బులు సంపాందించాలి. అలా సంపాదించగా వచ్చిన డబ్బులని కష్టాల్లో ఉన్న ప్రజలని ఆదుకోవడానికి, ప్రకృతి వల్ల జరిగిన నష్టాల్లో ఉన్న వారికి ఉపయోగిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో రకుల్‌, రానా పాల్గొన్న విషయం తెలిసిందే. కేపీహెచ్‌బీ కాలనీలో రకుల్‌ కూరగాయలు అమ్మితే, రానా ముఠామేస్త్రిలా మూటలు మోసాడు.

వీరితో పాటు అఖిల్‌ కూడా ఖమ్మంలో ఆటో నడిపి డబ్బులు సంపాదించాడు. సెలెబ్రిటీ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కార్యక్రమంలో స్టార్‌ హీరోలైన మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ కలిసి పనిచేయబోతున్నారట. దీనికి సంబందించి ఒక స్క్రిప్ట్‌ని కూడా లక్ష్మీ ప్రసన్న సిద్దం చేసిందని సమాచారం. మహేష్‌-ఎన్టీఆర్‌ కలిసి సినిమాలో నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. అది జరగకపోయినా వీరిద్దరూ కలిసి ఒకే ప్రోగ్రాంలో కనిపిస్తే నిజంగా అభిమానులకి పండగే.

English summary

Super star Mahesh Babu and Young Tiger Ntr is working together for Memu-Saitham program. This program is organising by Manchu Lakshmi Prasanna.