'బ్రహ్మోత్సవం' నష్టం పూడ్చేసారు..

Mahesh Babu and PVP vared Brahmotsavam loss

10:31 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

Mahesh Babu and PVP vared Brahmotsavam loss

లాభాలు వచ్చినప్పుడే కాదు నష్టం వచ్చినప్పుడు కూడా స్పందించాలనే సిద్ధాంతాన్ని వీళ్ళు బానే వంట బట్టించుకున్నారు. అందుకే నష్టపోయిన వాళ్లకు ఆ నష్టాన్ని పూడ్చారు. ఇంతకీ ఎవరంటే, మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ డిస్టిబ్యూటర్లను నష్టాలపాలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీని డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొన్నారు. అయితే, ప్లాప్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మోత్సవం చతికిలబడింది. దీంతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లని ఆదుకునేందుకు నిర్మాత ప్రసాద్ పొట్లూరి, హీరో మహేష్ బాబు ముందుకొచ్చారు. నిర్మాత పివిపి 12.5 కోట్లు, హీరో మహేష్ 5 కోట్లు డిస్టిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేశారు. ఈ విధంగా వాళ్ళ నష్టం పూడ్చినట్లు అయింది.

English summary

Mahesh Babu and PVP vared Brahmotsavam loss