ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డ 'మహేష్‌'!

Mahesh Babu angry on his fans

03:21 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Mahesh Babu angry on his fans

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' వంటి సుపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీకాంత్‌ అడ్డాల ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌ బాబు సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది. అయితే మహేష్‌ని చూడటానికి ఊటీలో షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిన మహేష్‌ అభిమానులు వాళ్లతో ఫోటోస్‌ దిగమని మహేష్‌ని కోరారట. సరే అని మహేష్‌ అంగీకరించడంతో చాలా మంది కెమెరాలతో ఎగబడి మహేష్‌కి ఇరిటేషన్‌ తెప్పించారట. తన టైమ్‌ని వేస్ట్‌ చేస్తున్నందుకు అభిమానుల పై విరుచుకుని పడ్డారట మహేష్.

ఆ తరువాత మహేష్‌ తన కెమెరామెన్‌ని పిలిపించి అభిమానులతో ఫోటోలు తియ్యమని చెప్పారట. కాసేపటికి కూల్‌ అయిన మహేష్‌ తన కోసం ఇంత దూరం ఎందుకొచ్చారని అభిమానుల్ని ప్రశ్నించారట, కొంచెం డిస్కషన్‌ కూడా జరిగిందట. గొడవేమీ కాకుండా మహేష్‌ వాళ్లని సున్నితంగా తిరష్కరించారట. పీవీపీ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలవుతుంది.

English summary

Mahesh Babu angry on his fans at Ooty in Brahmotsavam shooting.