'ప్రతాపరుద్రుడిగా' మహేష్‌

Mahesh Babu as Prataparudrudu

12:08 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu as Prataparudrudu

గుణశేఖర్‌ తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్‌ సమయంలోనే గుణశేఖర్‌ 'ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని అనౌన్స్‌ చేశాడు. రుద్రమదేవి లో గోన గన్నారెడ్డి పాత్ర ఎంత హైలైట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాత్రలో అల్లు అర్జున్‌ ఇట్టే ఒదిగిపోయాడు. ఇప్పుడు ప్రతాపరుద్రుడి పాత్రని కూడా గుణశేఖర్‌ అలాగే మలిచాడట. ఇందుకోసం మహేష్‌ ని సంప్రదించే పనిలో గుణశేఖర్‌ నిమఘ్నమైనట్లు తెలుస్తుంది. మహేష్‌ గుణశేఖర్‌ డైరెక్షన్‌లో ఒక్కడు, అర్జున్‌, సైనికుడు వంటి చిత్రాల్లో నటించాడు. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ప్రతాపరుద్రుడు పాత్రలో నటించడానికి మహేష్‌ అంగీకరిస్తాడా? లేదా? అనేది ఇప్పుడు క్వశ్చన్‌ మార్క్‌.

ఇది కూడా చదవండి: 'బుల్లి సర్దార్' గా అఖీరా నందన్

ఎందుకంటే మహేష్‌ ఇప్పటి వరకు మోడ్రన్‌ పాత్రల్లో తప్ప రాజుల కాలం నాటి పాత్రల్లో నటించలేదు. ఎందుకంటే మహేష్‌ ఆ పాత్రలకి సెట్‌ కాడని అభిమానులు మరియు మహేష్‌ ఉద్ధేశ్యం. మహేష్‌ సన్నిహితులు కూడా మహేష్‌ ఒప్పుకోకపోవచ్చని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: షాకింగ్: కళ్యాణ్‌ ది కూడా రెండో పెళ్లేనట

English summary

Mahesh Babu as Prataparudrudu. Gunasekhar upcoming movie is Prataparudrudu. In this movie Mahesh Babu will act as a Prataparudrudu.