మహేష్ అక్కడ దీవి కొన్నాడా?

Mahesh Babu bought Caribbean Island

06:13 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu bought Caribbean Island

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు వంటి ఘన విజయం తరువాత మహేష్ ఇంక వరుస పెట్టి సినిమా లు చేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నాడు. దాని తరువాత మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తాడు. దాని తరువాత మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్ర్రాలు కూడా లైన్లో పెట్టాడు. సౌత్ ఇండియా లో వరుస పెట్టి సినిమా లు చేస్తూ.. ఎక్కువ యాడ్స్ లో నటిస్తున్న హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే. మహేష్ తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ సంపాదిస్తుంది మహేష్ మాత్రమే.. ఇదిలా ఉంటే మహేష్ తాజాగా కరేబియన్ లో 9 నుండి 12 కోట్లు విలువ చేసే ఐలాండ్ కొన్నట్లు సమాచారం. దీనితో పాటు ముంబై లోని జూహి ఏరియా లో ఒక ఫ్లాట్ కూడా కొన్నాడట.

English summary

Mahesh Babu bought Island. Super Star Mahesh Babu bought Caribbean Island with 9-12 crores.