బ్రహ్మోత్సవంలో కాపి కొట్టిన మహేష్ 

Mahesh Babu Brahmotsavam Bike Copied From Rajasthan Tourism

02:57 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu Brahmotsavam Bike Copied From Rajasthan Tourism

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం . వచ్చే నెల 20నవిడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది . మే 7 న బ్రహ్మోత్సవం చిత్రం ఆడియో విడుదల కానుంది . బ్రహ్మోత్సవం సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నమహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఇటీవల బ్రహ్మోత్సవం సినిమా టీజ‌ర్ ను విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌లో మ‌హేష్ బాబు ఒక పొడ‌వాటి బైక్ మీద స్పెట్స్ పెట్టుకుని చాలా క‌ల‌ర్ ఫుల్‌గా కనిపించాడు . మహేష్ బాబు ఫస్ట్ లుక్ చూసిన వారందరూ ఈ పొడ‌వాటి బైక్ మీద సినిమాలో త‌న‌కు మ‌ర‌ద‌ళ్లుగా న‌టిస్తున్న స‌మంత‌, ప్ర‌ణీత‌, కాజ‌ల్ ఈ ముగ్గురుని ఎక్కించుకుని ఉంటాడని అప్పుడే ఉహాగానాలు వేసేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

అయితే బ్రహ్మోత్సవం టీజర్ లో ఉన్న ఈ పొడవాటి బైక్ ను బ్రహ్మోత్సవం సినిమా కంటే ముందు రాజస్తాన్ రాష్ట్ర టూరిజం యాడ్ లో వాడారు . ఆ యాడ్ లో ఎడారిలో నలుగురు టూరిస్టులు బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక వ్యక్తీ మూడు చక్రాల బైక్ పై వచ్చి దాని మీద ఆ నలుగురు టూరిస్ట్ లను ఎక్కించుకుని వెళ్తాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవంలో వాడిన బైక్ కూడా సేమ్ అలాగే ఉండటం ,ఆ బైక్ పై ఉన్న పేర్లు సైతం అవే కావడం విశేషం. దీంతో మహేష్ బాబు పై రాజ‌స్థాన్ టూరిజం బైక్‌ను మ‌హేష్ కాపీ కొట్టేశాడ‌న్న సెటైర్లు సోష‌ల్ మీడియాలో ప‌డుతున్నాయి. రాజస్తాన్ టూరిజం వీడియో ను మీరు ఓసారి చూడండి.

ఇవి కూడా చదవండి:ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పదు

ఇవి కూడా చదవండి:'బాహుబలి 2' లో జయదేవ్ రాణాగా ఎన్టీఆర్!

English summary

Super Star Mahesh Babu was acting in Brahmotsavam movie and this movie was going to release on May 20th . Recently this movie teaser was released and in this trailer Mahesh Babu Looked with a Long Bike and that bike was appeared in Rajasthan State Tourism Advertisement. Now this going viral over the internet.