దూకుడు సీక్వెల్ వస్తోందా? మరి దర్శకుడెవరో?

Mahesh Babu Busy With His Upcoming Projects

11:23 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Mahesh Babu Busy With His Upcoming Projects

సినిమాలు ఎంత బాగా తీసినా ఒక్కోసారి డిజాస్టర్ అయిపోతాయి. ఒక్కోసారి ఏమాత్రం సోదిలో ఉండదని అనుకున్నా, టాప్ రేంజ్ కి చేరిపోతుంది. మనం ఇటీవల చూసిన సినిమాల్లో బిచ్చగాడు, బ్రహ్మోత్సవం మధ్య పోలిక చూస్తే, ప్రేక్షకుల నాడి పట్టడం చాలా కష్టం. కానీ డిజాస్టర్ నుంచి తేరుకుని ఆశావాదంతో ముందుకు పోవడమే ఉత్తమం. సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు అదే చేస్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మోత్సవం ఊహించని విధంగా నిరాశపరచిన తరువాత ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళి గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఫుల్ గా రీఛార్జ్ అయిన మహేష్ వెంటనే మురుగదాస్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేసాడు. ఆ మూవీ ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

మురుగదాస్ మూవీ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే, మహేష్ మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టి మాంచి దూకుడు మీద వున్నాడు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్ లో తనకు శ్రీమంతుడు లాంటి ఆల్ టైం హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఒక మూవీ ..మైత్రి మూవీ మేకర్స్ తో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక మూవీ ..బ్రహ్మోత్సవం తీసిన పి విపి బ్యానర్లో వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా ఒక మూవీ ఇప్పటికే ఓకే చెప్పేసాడు. తనకు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ తో మరో మూవీకి కమిట్ అయ్యాడట. తాజాగా బయటకొచ్చిన న్యూస్ ఇది. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో ఇంకా ఫైనల్ కాలేదు. మొత్తానికి ప్రిన్స్ మహేష్ బాబు స్పీడు పెంచడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా వున్నారు.

ఇవి కూడా చదవండి:ప్రియురాలు పడిపోతుంటే కాపాడాల్సింది పోయి ఏం చేసాడో చూడండి

ఇవి కూడా చదవండి:వయస్సు గురించి వెంకీ షాకింగ్ కామెంట్స్

English summary

Super Star Mahesh Babu was busy with his films and mahesh babu signed a movie with Koratala Shiva,Mythri Movie Makers,and 14 reels entertainments.