బ్రహ్మోత్సవంలో మహేష్ క్యారెక్టర్ అదా??

Mahesh Babu character in Brahmotsavam

12:45 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu character in Brahmotsavam

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మే 20న విడుదలవ్వబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చూసినప్పుడు మహేష్ తర్వాత అన్నిటికంటే ఆకట్టుకునే విషయం.. అక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్స్. ఆడియో వేడుకని కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన విషయం ఫ్యాన్స్ కు బాగానే గుర్తుంది. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సెట్స్ సినిమాలో 15 పైగా ఉంటాయట. సాధారణంగా సెట్స్ కు ఉపయోగించే రంగులతో పోల్చితే.. బ్రహ్మోత్సవంలో కలర్స్ ను బాగా డిఫరెంట్ గా ఉపయోగించారు. ఆ కలర్ కాంబినేషన్స్ చూస్తే ప్రేక్షకులు అదరహో అనాల్సిందే అంటున్నారు.

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

ఇంతగా రంగులకు ప్రాధాన్యతనివ్వడానికి కారణం.. బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు పాత్రేనట. ఈ చిత్రంలో మహేష్ కి ఓ కలర్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది. ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం కోసమే.. ఇలా రంగులను ఉపయోగించామని చెబుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. మహేష్ బాబు ఇల్లు, టెర్రస్, సత్యరాజ్ గది, మహేష్ రూమ్, టెర్రస్, పెళ్లి మండపం, నిశ్చితార్ధ వేడుక, బెజవాడ దుర్గ గుడి, తిరుమల దేవాలయం.. ఇలా మొత్తం 15 సెట్స్ వేశారట. ఇందులో మహేష్ రూమ్, మండువా ఇల్లు తనకు బాగా నచ్చిన సెట్స్ అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి.

ఇది కూడా చదవండి: శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

English summary

Mahesh Babu character in Brahmotsavam. Super Star Mahesh Babu character in Brahmotsavam movie is he owned the colors company.