'భలే మంచి రోజు' ఆడియో విడుదలకు మహేష్‌!!

Mahesh Babu chief guest for Bhale Manchi Roju audio function

06:34 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu chief guest for Bhale Manchi Roju audio function

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కి బావ అయిన సుధీర్‌బాబు 'ఎస్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత 'ప్రేమ కధా చిత్రమ్‌' సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు. రీసెంట్‌గా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' వంటి ప్రేమ కావ్యంలో నటించి అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. సుధీర్‌బాబు బాలీవుడ్‌లో కూడా విలన్‌గా నటిస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భలేమంచిరోజు' ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణను హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా విడుదల చేస్తున్నారు.

ఈ ఫంక్షన్‌కి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ముఖ్యఅతిధిగా రావడంతో 'భలేమంచిరోజు' టీమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆడియోకి మహేష్‌ రానుండడంతో సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ అభిమానులు భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సరసన 'వామికా గబ్బీ' హీరోయిన్‌గా నటిస్తుంది. నూతన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నారు.

English summary

Mahesh Babu chief guest for Bhale Manchi Roju audio function, in the movie who was acted as a hero is Sudheer Babu.