ఆడియో వేడుకకి పంచెకట్టులో మహేష్‌

Mahesh Babu coming in Dhoti to Brahmotsavam audio

05:41 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Mahesh Babu coming in Dhoti to Brahmotsavam audio

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో, అందులో మహేష్‌ వేసుకున్న లుంగీ సన్నివేశం అంత ఆకర్షణగా నిలిచింది. 'శ్రీమంతుడు' తరువాత మహేష్‌ నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం పై నిండు సాంప్రదాయం ఉట్టి పడేలా టైటిల్‌ పెట్టిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రం ఆడియో వేడుక విషయంలో కూడా అదే సాంప్రదాయాన్ని చూపించాలి అనుకుంటున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం ఆడియో వేడుకని ఏప్రిల్‌ 10న విడుదల చెయ్యాలని ఈ చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

అయితే ఈ చిత్రం ఆడియోను తొలుత తిరుపతిలో విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ ఎండలు మండిపోతుండడంతో ఇప్పుడు ఈ వేడుకని హైదరాబాద్‌ కి షిఫ్ట్‌ చేశారు. అయితే హైదరాబాద్‌ లోనే తిరుపతిని గుర్తు చేసుకునేలా ఒక భారీ సెట్‌ని వెయ్యబోతున్నారట. ఈ చిత్రంలో నటీనటులందరినీ సాంప్రదాయంగా రెడీ చేసి ఆడియో వేడుకని నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకి మహేష్‌ పంచె కట్టులో రానున్నారని సమాచారం.

English summary

Super Star Mahesh Babu coming in Dhoti to Brahmotsavam audio launch. This audio function is conducting in Hyderabad not in Tirupati.