మహేష్ డైరెక్షన్ అదిరింది

Mahesh Babu directed Brahmotsavam audio event

11:22 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu directed Brahmotsavam audio event

ఇదేమిటి అనుకుంటే ఇది చదవాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ 'బ్రహ్మోత్సవం' ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా.. ఓ పండగ రేంజ్ లో సాగింది. షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా మొదలైన ఈ కార్యక్రమం.. సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేశారు. మహేష్ బాబు-భార్య నమ్రతాతో పాటు ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ - విజయనిర్మల కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మామూలుగా ఆడియో రిలీజ్ అంటే.. దాదాపు ఒక గంట ఫంక్షన్ పూర్తయ్యాక హీరోలు ఎంట్రీ ఇస్తారు. కానీ 'బ్రహ్మోత్సవం' మాత్రం సరిగ్గా 8 గంటలకు.. మహేష్ బాబు వచ్చాక మొదలైంది.

ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి అక్కడే ఉన్న హీరో మహేష్ కానీ ఒకసారి వచ్చాక ఈవెంట్ అంతా బోలెడంత ఎనర్జిటిక్ గా మారిపోయింది. మన హీరో ఎదురుగా కూర్చున్నాడన్న మాటే కానీ.. ప్రతీ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసేశాడు. అంతే కాదు.. తన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ కనిపించాడు. నిర్మాత పీవీపీతో సహా అందరికీ సూచనలు ఇచ్చేస్తున్నాడు. ఇదంతా చూసినవాళ్లకు ఓ విషయం మాత్రం అర్ధమైపోయింది. ఈ సంగీతోత్సవం కాన్సెప్ట్ అంతా మహేష్ స్వయంగా డిజైన్ చేసినదేనని.. తన డైరెక్షన్ లోనే ఈ ఈవెంట్ జరుగుతోందనే విషయం తేలిపోయింది.

మొత్తానికి సినిమా మేకింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో.. ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా అంత కంటే ఎక్కువ అలర్ట్ గా ఉన్నాడు. దటీజ్ మహేష్ అంటూ పలువురు చెప్పుకోవడం విశేషం.

English summary

Mahesh Babu directed Brahmotsavam audio event. Super Star Mahesh Babu organised and directed Brahmotsavam audio event.