చెన్నై బాధితులకు మహేష్‌ విరాళం!!

Mahesh Babu donates 10 lakhs to chennai flood victims

11:43 AM ON 3rd December, 2015 By Mirchi Vilas

Mahesh Babu donates 10 lakhs to chennai flood victims

చెన్నైలో మూడు వారాల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం అస్తవ్యస్తం అయింది. వరదల వల్ల సష్టపోయిన ప్రజలకు సెలబ్రిటీస్‌ తమ వంతు సాయం అందిస్తున్నారు. టాలీవుడ్‌ నుండి సంపూర్ణేష్‌బాబు 50 వేలు విరాళం అందించగా ఇంతకముందు ఎన్టీఆర్‌ 10 లక్షలు, కళ్యాణ్‌రామ్‌ 5లక్షలు అందించారు. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు వరద బాధితులకు 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ పది లక్షల రూపాయల చెక్‌ను తమిళనాడు రిలీఫ్‌ ఫండ్‌కి అందజేస్తారు. మహేష్‌ మాట్లాడుతూ వరదల వల్ల చెన్నై అస్తవ్యస్తం అయింది ఇటువంటి పరిస్థితి నుంచి చెన్నై త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మహేష్‌ చెప్పారు.

English summary

Mahesh Babu donates 10 lakhs to chennai flood victims. He prayed that Chennai have to recover as soon as possible.