షికార్లు ముగిసాయి ... ఇక సెట్స్ పైకి ...

Mahesh Babu Family Enjoys In Europe

10:31 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Mahesh Babu Family Enjoys In Europe

వేసవి విడిది తర్వాత పిన్స్ మహేష్ బాబు మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ కు రాబోతున్నాడు. దాదాపు 15 రోజులుగా యూరప్ లోని కీలకమైన ప్రాంతాల్లో ప్రిన్స్ అండ్ కో ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించినది ఈ పిక్. లొకేషన్ ఎక్కడన్నది పక్కనబెడితే.. మంచు ప్రాంతాల్లో జర్నీ చేస్తున్న సందర్భంలోనిది. ప్రిన్స్ అభిమానులను ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

లొకేషన్స్ ని ఇటు గౌతమ్, అటు సితార ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు జులై 5 నుంచి ఆషాడం మొదలు అవుతున్నందున ఈలోగానే అంటే ఈనెల 20 నుంచి మురుగదాస్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తికావడంతో ప్రిన్స్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రిన్స్ న్యూ్ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్టర్స్ ని పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. అందుకు సంబంధించిన స్టిల్ ఇది. మొత్తానికి ప్రిన్స్ కొత్త సినిమా హంగామా మొదలైందన్నమాట.

ఇవి కూడా చదవండి:బన్నీకి సూపర్ స్టార్ తో నటించాలని ఉందట!

ఇవి కూడా చదవండి:ఏకంగా చెరువులోనే న్యూడ్ గా పడకేసింది!

English summary

Tollywood Super Star Mahesh Babu was enjoying with his family in Europe and now he completed the tour and he was going to come to India within Four to five days and he was going to participate in A.R.Muragados Film.