అల్లు అరవింద్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్

Mahesh Babu Fans Attack On Allu Aravind

10:30 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Fans Attack On Allu Aravind

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఓ అనవసర వివాదం చుట్టుముట్టింది అల్లు ఫ్యామిలీని. తాజాగా మరో కాంట్రవర్శీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాడు అల్లు అరవింద్. ఈసారి ఆయన మీద పవన్ ఫ్యాన్స్ కాదు.. మహేష్ బాబు అభిమానులు అటాక్ చేస్తున్నారట. ఇప్పుడు కొత్తగా వాళ్లతో వైరం ఏంటి అంటే.. తన కొడుకు సినిమా ‘సరైనోడు’ కోసమని ఉత్తరాంధ్రలో థియేటర్లను అరవింద్ బ్లాక్ చేసి పెట్టారట . దీంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు అక్కడ సరిపడా థియేటర్లు దొరకట్లేదట.

ఇవి కూడా చదవండి:ఛ ఛ.. నడి వీధిలో... అది కానిచ్చేసారు(వీడియో)

దీంతో ‘చీప్ అల్లు పాలిటిక్స్’ అనే నెగెటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అరవింద్ మీద విరుచుకుపడుతున్నారు మహేష్ అభిమానులు. థియేటర్ల బ్లాకింగ్ విషయంలో వాస్తవాలేంటో తెలియాల్సి ఉంది కానీ.. మహేష్ అభిమానులు మాత్రం అరవింద్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మామూలుగా ఇలాంటి నెగెటివ్ ట్యాగ్ ల ట్రెండింగ్స్ కోలీవుడ్లోనే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య టాలీవుడ్లోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది.

ఆల్రెడీ అల్లు అర్జున్ మాటను పట్టుకుని ‘చెప్పను బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇప్పడు మహేష్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేశారు. మొత్తానికి ‘సరైనోడు సక్సెస్ ఆనందంలో ఉన్న సమయంలో ఈ లేని పోని వివాదాలేంటో అల్లు ఫ్యామిలీకి అర్థం కావట్లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:లిప్ కిస్ తో కాజల్ ను షాక్ చేసిన హీరో

ఇవి కూడా చదవండి:మందు కొట్టాక అలా చేసారో ఇక అంతే!

English summary

Tollywood Super Star Mahesh Babu's "Brahmotsavam" movie was going to release on this Friday and Producer allu aravind blocked so many theaters for his son film Sarainodu and Brahmotsavam movie did not get proper theaters for the movie release and mahesh babu fans attcked him on twitter by saying that "#Cheap Allu Politics".