ఆ ఎంఎల్ఏ పై సూపర్ స్టార్ ఫాన్స్ ఆగ్రహం

Mahesh Babu fans fire on MLA

11:36 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Mahesh Babu fans fire on MLA

రాజకీయ నాయకులు సినిమాల్లోకి రావడం, సినిమావాళ్లు రాజకీయాల్లో ఉండడం తెల్సిందే. ఇక సినిమాలు తరచూ చూసే, రాజకీయ నేతలు సరేసరి. ఆ కోవకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన కామెంట్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ ఆగ్రహంతో వున్నారు. ఎంఎల్ఏ వ్యాఖ్యలు ఫాన్స్ కు కంపరం పుట్టిస్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి ఇవేంమాటలంటూ సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఈ రాధ్ధాంతానికి కారణం ఏంటంటే, మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం పై రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు.

తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటానని, ఈ మధ్యే బిచ్చగాడు సినిమా చూశానని బాలకిషన్ చెబుతూ.. బిచ్చగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం జరుపుకుంటుంటే... మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మాత్రం కలెక్షన్లు లేక బిచ్చగాడుగా మిగిలిందని వ్యాఖ్యానించారు. ఇదే మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్యే టైటిల్స్ కలిశాయని ఇలా అన్నారో లేక వెటకారంగా అన్నారో ఏమోకాని మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

English summary

Mahesh Babu fans fire on MLA