శ్రీకాంత్ అడ్డాల పై మహేష్ అభిమానులు దాడి

Mahesh Babu fans fires on Srikanth Addala

12:36 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Mahesh Babu fans fires on Srikanth Addala

సూపర్ స్టార్ మహేష్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'బ్రహ్మోత్సవం' శుక్రవారం విడుదలై అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు మహేష్ అభిమానులకు కూడా నిరుత్సాహమే మిగిల్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాను దృష్టిలో పెట్టుకొని ఈ కాంబినేషన్ లో మరో విజయవంతమైన సినిమా రాబోతుందని ఆశించిన మహేష్ ఫాన్స్ కి 'బ్రహ్మోత్సవం' నిరాశ కలిగించడంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై మహేష్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

సోషల్ నెట్వర్క్ లో శ్రీకాంత్ అడ్డాల పై పోస్టులతో మహేష్ ఫాన్స్ దాడి చేస్తున్నారు. ఇంకొదరైతే తమ హీరోతో ఇలా సిరియల్ లాంటి సినిమా చెయ్యడం ఏంటి? అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక కుటుంబ కధా చిత్రంగా గొప్ప విజయం అందుకొని ఓవర్సీస్ లో కూడా దుమ్ము దులిపెస్తుందని అనుకుంటే.. అక్కడ కూడా ఫాన్స్ కు నిరాశే మిగిల్చింది. ఇటివలే 'శ్రీమంతుడు' విజయంతో కలెక్షన్స్ సునామి సృష్టించిన మహేష్ కు ఇలాంటి అపజయం అందించడంతో శ్రీకాంత్ అడ్డాల పై ఫైర్ అయిపోతున్నారు మహేష్ ఫాన్స్. ఇక 'బ్రహ్మోత్సవం' నిరాశ కలిగించడంతో ఆశలన్నీ మురుగదాస్ చిత్రం పైనే మహేష్ అభిమానులు పెట్టుకున్నారు.

English summary

Mahesh Babu fans fires on Srikanth Addala