దూకుడు పెంచిన సూపర్ స్టార్ మహేష్

Mahesh Babu full busy with his schedule

11:25 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Mahesh Babu full busy with his schedule

'బ్రహ్మోత్సవం' అనుకోని విధంగా బాకాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మాంచి కసిమీదున్న మహేష్ అభిమానుల అంచనాలకు తగ్గకుండా సూపర్ స్టార్ మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్నాడట. అసలు వీరిద్దరి కలయికే ఓ ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మురుగదాస్ మార్క్ కథలో మహేష్ ఎలా కనిపించబోతున్నాడు? అంటూ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మురుగదాస్ సినిమా అంటే కథానాయకుల అభిమానులే కాదు, ఇటు సామాన్య ప్రేక్షకుడూ ఆస్వాదించేలా ఉంటుంది. ఇక ప్రేక్షకుల్లోని ఆత్రుతకి తగ్గట్టుగానే మహేష్ దూకుడు పెంచాడు.

ఆగకుండా, ఆపకుండా చిత్రీకరణలో యమ బిజీగా పాల్గొంటున్నాడు. దీంతో చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మహేష్ తో పాటు కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తర్వాత చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు ఇప్పటిదాకా చేయనటువంటి ఓ కొత్త పాత్రలో కనిపించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్ణయించిన ఈ మూవీపై అటు ఫిలిం వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

ఇది కూడా చదవండి: పవన్ స్పీచ్ ఇస్తుంటే చిరు ఏమి చేసాడో తెలుసా?

ఇది కూడా చదవండి: నాగ్ 'హాథీరామ్ బాబా' ఫస్ట్ లుక్

English summary

Mahesh Babu full busy with his schedule. Mahesh Babu busy with AR Murugadoss movie.