పది కోట్లు అడ్వాన్స్‌ తిరిగిచ్చేసిన మహేష్‌!!

Mahesh Babu gave back 10 crores advance to producer

07:07 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu gave back 10  crores advance to producer

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అమ్మాయిల కలల రాకుమారుడు. మాస్‌లో మంచి ఫాలోయింగ్‌, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు మహేష్‌ నటనని ఇష్టపడని వాళ్లుండరు. అందుకే ఆయన టాలీవుడ్‌ నెం.1 హీరో అయ్యారు. ఎంత పెద్ద హీరో అయినా గర్వం అనే ఛాయలు ఆయన దగ్గరికి రావు, ఎంత ఎదిగినా ఒదిగుండటమే ఆయన క్యారెక్టర్‌ ఇలాంటి వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తాజాగా ఈయన చేసిన గొప్ప పని వెలుగులోకి వచ్చింది. మాములుగా ఏ దర్శకుడు, నిర్మాతైనా త్వరగా గుర్తింపు రావడం కోసం స్టార్‌ హీరోలతో సినిమాలు చెయ్యడానికి వెంటపడతారు.

నిర్మాతలు దర్శకుడు, కధ ఒకే అవ్వకపోయిన హీరో అంగీకరించేస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దామని హీరోలకి కళ్లు చెదిరే అడ్వాన్స్లు ఇచ్చి హీరోలని కమిట్‌ చేయించేస్తారు. తాజాగా హీరో మహేష్‌బాబుకి 10 కోట్లు అడాన్స్‌ ఇచ్చి హడావుడిగా ఓకే చేయించిన నిర్మాత రాధాకృష్ణ. ఇప్పుడు తన చెక్‌ వెనక్కి వచ్చేయడంతో ఆశ్చర్యపోయారు. రాధాకృష్ణకి మంచి మిత్రుడైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మహేష్‌బాబు హీరోగా ఒక చిత్రం చెయ్యాలనుకున్నాడు. రాధాకృష్ణ వచ్చే సంవత్సరంలో ఈ సినిమాని సెట్స్‌ పైకి తీసుకువెళ్లాలనుకున్నాడు.

అయితే మహేష్‌ బ్రహ్మూెత్సవం అయిపోయాక కె.ఆర్‌. మురుగుదాస్‌ డైరెక్షన్‌లో చెయ్యడానికి కమిట్‌ అయ్యాడు. అంటే వచ్చే సంవత్సరం మహేష్‌ డేట్స్‌ ఉండవు. త్రివిక్రమ్‌ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి మహేష్‌తో సినిమా పై స్పష్టత లేదు. ఆ విషయాన్ని గ్రహించిన మహేష్‌ తనకిచ్చిన 10 కోట్లు అడ్వాన్స్‌ను వడ్డీతో సహా తిరిగిచ్చేశాడట. మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ గారు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదట. ఇప్పుడు మహేష్‌ చేసింది నిజమే అయితే మహేష్‌ తండ్రిని మించిన తనయుడు అనడంలో సందేహాం లేదు.

English summary

Mahesh Babu gave back 10 crores advance to producer Radha krishna.