మహేష్‌ కి కోపం తెప్పించిన పుకార్లు!!

mahesh babu got angry on rumours

03:25 PM ON 24th November, 2015 By Mirchi Vilas

mahesh babu got angry on rumours

ప్రిన్స్‌ మహేష్‌ బేసిక్‌గా చాలా కూల్‌ పర్సన్‌, ఎప్పుడు ఎవరితోనూ విబేధాలు లేవు. చాలా సింపుల్‌ అండ్‌ సైలెంట్‌గా ఉంటారు. ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళినా, ఎమైనా కార్యక్రమాలకు వెళ్ళినా చాలా తక్కువ మాట్లాడతారు మహేష్‌. అటువంటి కూల్‌ పర్సన్‌కి ఆగ్రహం తెప్పించేలా చేసింది సోషల్‌ మీడియా. తన తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం' కధ విషయంలో దర్శకుడితో మహేష్‌కి మనస్పర్ధలు వచ్చి ఘాటింగ్‌ నిలిపేశారని పుకార్లు పుట్టాయి. అవి అబద్ధమని చిత్ర యూనిట్‌ ఈ రూమర్లు పై క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈ పుకార్లు వల్ల సినిమా బిజినెస్‌ పై ప్రభావం చూపుతాయని మహేష్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట.

అసలు ఆ పుకార్లు ఎలా పుట్టాయో పీఆర్‌ బృందంని అడిగి, వెంటనే వీటిని క్లారిఫై చేయాలని ఆదేశించాడటట. ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలుసుకుని వాళ్ళ పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోమని చెప్పాడట. మామూలుగా ఇండస్ట్రీలో మహేష్‌కి యాన్టీ అయిన వాళ్ళు చేశారని మహేష్‌కి తెలియంది కాదు.

English summary

mahesh babu got angry on rumours which was coming on brahmotsavam movie story is not satisfied by mahesh and shooting was stopped on the spot.