అతిధి పాత్రలో 'మహేష్‌'?

Mahesh Babu in Guest role?

02:04 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Mahesh Babu in Guest role?

సూపర్‌స్టార్‌ కృష్ణ చాలా కాలం తరువాత నటిస్తున్న చిత్రం 'శ్రీశ్రీ'. ముప్పలనేని శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సరసన విజయనిర్మల నటిస్తుంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అతిధిపాత్రకోసం మహేష్‌ని నటింపజేయాలని ముప్పలనేని శివ భావిస్తున్నాడట. అందుకోసం తండ్రి కృష్ణ తో మహేష్‌ని సంప్రదించమని కృష్ణని కోరాడట. అయితే మహేష్‌ ఇంతవరకు ఏ సినిమా లో కూడా అతిధి పాత్రలో నటించలేదు. అంతేకాదు మహేష్‌బాబుకు ఉన్న ఇమేజ్‌ బట్టి మహేష్‌ గెస్ట్‌రోల్‌లో కనిపించాలంటే అది పెద్ద స్టార్‌ హీరో సినిమా అయిఉండాలి. ఒక మంచి కథ ఉండి మహేష్‌ పాత్ర ఎంతో గోప్పదైతే తప్ప చెయ్యకూడదు.

కానీ ఇది మహేష్‌ తండ్రి కృష్ణ సినిమా కాబట్టి మహేష్‌ నటిస్తాడనే అనుకుంటున్నారు అంతా. అంతే కాకుండా తన తండ్రితో కలిసి నటించడానికి ఎప్పుడైనా సిద్ధమే అని మహేష్‌ చాలా సార్లు చెప్పాడు కూడా. పైగా చాలా కాలం తర్వాత సూపర్‌స్టార్‌ నటిస్తున్నారు, మహేష్‌లాంటి స్టార్‌ హీరో ఇలాంటి చిన్న సినిమాలో నటిస్తున్నాడంటే సినిమాకి హైప్‌ వస్తుందని ముప్పలనేని శివ అభిప్రాయం. ఇంతకీ మహేష్ నటిస్తాడో లేదో చూడాలి.

English summary

Mahesh Babu in Guest role? Direct muppalaneni siva wants to act mahesh babu in Super star Krishna's SriSri movie.