జనతా గ్యారేజ్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా

Mahesh Babu in Janatha Garage

09:52 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu in Janatha Garage

అవునా, ఎన్టీఆర్ కధానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'జనతా గ్యారేజ్' కి రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ కీలక భూమిక వహిస్తుండగా, ఎన్టీఆర్ తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ ఒకే అయినట్లు వార్తలొచ్చాయి. కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాలో ఉంటాడట. నటన పరంగా కాకుండా కొన్ని పాత్రలు, సీన్స్ లో మహేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వుంటుదట. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రానికి మహేష్ చెప్పిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ మాంచి కిక్కు ఇచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రేమతో జనతా గ్యారేజ్ లో మహేష్ వాయిస్ ఇవ్వనున్నాడట.

English summary

Mahesh Babu in Janatha Garage. Super Star Mahesh Babu giving voice over to Janatha Garage movie.