మెహెర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు

Mahesh Babu in Ramakrishna Venuzia advertisement

06:15 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu in Ramakrishna Venuzia advertisement

‘కంత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్.. ఆ తర్వాత ప్రభాస్ కి ‘బిల్లా’ లాంటి యావరేజ్ మూవీ అందించాడు. ఆ పై అతను రూ.40 కోట్ల బడ్జెట్ తో అతను తెరకెక్కించిన ‘శక్తి’ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ‘షాడో’ తో వెంకీకి కూడా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు మెహర్. ఆ తర్వాత మెహర్ తో సినిమా చేసే సాహసం ఇంకెవ్వరూ చేయలేదు. అయితే అలాంటి డిజాస్టర్ డైరెక్టర్ తో మహేష్ బాబు పని చేయడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారు? కానీ ఇది నిజం. మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ నటించబోతుండటం కాదు.. ఆల్రెడీ నటించేశాడు కూడా. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది.

మహేష్ నటించింది సినిమాలో కాదు. ఓ ప్రకటనలో. అది ‘రామకృష్ణ వెనుజియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కోసం తయారు చేసిన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్న ఈ సంస్థకు మహేష్ బాబు ఇటీవలే ప్రచారకర్తగా నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం ఇప్పటికే ఓ యాడ్ కూడా చేసేశాడు మహేష్. ప్రిన్స్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా.. రాయల్ గా కనిపిస్తున్న ఈ యాడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా.. తన సినిమాల్ని చాలా స్టైలిష్ గా.. రిచ్ గా తీస్తాడని మెహర్ కు పేరుంది. ఈ యాడ్లో సైతం ఆ స్టైల్ - ఆ రిచ్ నెస్ కనిపించింది. ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి..


English summary

Mahesh Babu in Ramakrishna Venuzia advertisement. Super Star Mahesh Babu latest ad Ramakrishna Venuzia directed by Meher Ramesh.