ఇంటలిజెన్స్ అధికారిగా ప్రిన్స్

Mahesh Babu is acting as a intelligence officer

10:44 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Mahesh Babu is acting as a intelligence officer

పోలీసు అధికారి పాత్రలో చించేసిన ప్రిన్స్ మహేష్ తాజాగా ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో అలరించబోతున్నాడట. ఈ వేసవిలో విడుదలైన బ్రహ్మోత్సవం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తన తర్వాతి సినిమా పై మహేష్ పక్కాగా దృష్టి సారించాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ నటించనున్నట్లు తెల్సిందే. ఈ చిత్రంలో ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించనున్నాడనే టాక్ ఫిలింనగర్లో జోరుగా వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటీనటులు ఎంపిక దాదాపుగా ఖరారైంది.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియాలో ఈ సినిమాకు సంబంధించి ఇంటలిజెన్స్ ఆఫీసు సెట్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ వేయగానే సినిమా సెట్స్ పైకి వెళ్లేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో బాలీవుడ్ భామ పరినీతి చోప్రా జోడీ కట్టనుంది. అలాగే గజని, తుపాకి వంటి సినిమాలకు ఆర్ట్ డైరక్టర్గా పని చేసిన సునీల్, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హారిశ్ జయరాజ్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. హారిశ్ జయరాజ్ ఇప్పటికే ఓ మాంచి ట్యూన్ కూడా రెడీ చేశాడట.

ఈ సినిమా పై సహజంగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నందున అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉండాలని ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడట.

English summary

Mahesh Babu is acting as a intelligence officer