పవన్‌ని ఫాలో అవుతున్న మహేష్‌ 

Mahesh Babu is following Pawan Kalyan

04:38 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu is following Pawan Kalyan

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ని ఫాలో అవుతున్నారు. అవును ఇది నిజం హైదరాబాద్‌ శివార్లలో పవన్‌కి ఒక ఫార్మ్‌హౌస్‌ ఉన్న విషయం తెలిసిందే. పవన్‌ అక్కడ మొక్కలకి నీరు పోస్తూ, మొక్కలని చూసుకుంటూ ఎక్కువ సమయాన్ని అక్కడే గడుపుతారన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్‌ బాటలోనే మహేష్‌ కూడా వెళ్తున్నాడు. మహేష్‌ హైదరాబాద్‌లోని గండిపేట దగ్గర రీసెంట్‌గా 3 ఎకరాలు స్థలం కొన్నాడు. ఇది ఓషెన్‌ పార్క్‌ కి సమీపం. అక్కడ ఒక ఫార్మ్‌హౌస్‌ని మహేష్‌ నిర్మించబోతున్నారు. దీని నిర్మాణాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్‌ దగ్గరుండి చూసుకోబోతుందట.

అంటే పవన్‌లానే మహేష్‌ మొక్కలతో గడపనున్నాడని అర్ధమవుతుంది. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.

English summary

Super star Mahesh Babu is following Power star Pawan Kalyan idea. Mahesh Babu bought 3 acres at gandipet. He want to build farm house their.