నాని ఆడియోలో సూపర్‌స్టార్‌!!

Mahesh Babu is special guest for Nani's audio function

03:53 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Mahesh Babu is special guest for Nani's audio function

'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో నాని. ప్రస్తుతం నాని 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్‌ ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా ఈ చిత్రం ఆడియోని జనవరి 18న (ఈరోజు) విడుదల చేయబోతున్నారు. ఈ ఆడియో వేడుకకి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. అసల నాని ఆడియో ఫంక్షన్‌ కి అంతపెద్ద హీరో రావడమేంటీ అని అభిమానుల్లో కొంచెం అనుమానం నెలకొంది. అయితే దీనికి కారణం లేకపోలేదు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో మహేష్‌బాబు దూకుడు, ఆగడు, నేనొక్కడినే వంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో మహేష్‌కి ఈ సంస్థ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం వల్లే మహేష్‌ ఈ ఆడియోకి వస్తానని చెప్పారట. మహేష్ వస్తుండడంతో ఆడియో వేడుక కార్యక్రమాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారని టాక్.

English summary

Mahesh Babu is special guest for Nani's 'Krishna Gadi Veera Prema Gadha' movie audio function. 14 reels entertainment banner is producing this movie.