తండ్రి ఆడియోకి తనయుడు గెస్ట్‌

Mahesh Babu is the chief guest for Sri Sri movie

04:40 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu is the chief guest for Sri Sri movie

చాలా గ్యాప్‌ తరువాత సూపర్‌స్టార్‌ కృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీశ్రీ'. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ నిర్మల కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నరేష్‌ కూడా పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ప్రిన్స్‌ మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ చిత్రం ఆడియోకి ఛీప్‌ గెస్ట్‌గా ప్రిన్స్‌ మహేష్‌బాబు రానున్నాడట. ఈ చిత్రం ఆడియోని ఫిబ్రవరి 18న హైదరాబాద్‌ లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా విడుదల చేయనున్నారు. మహేష్‌ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రం ఘాటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary

Prince Mahesh Babu is the chief guest for his father Super Star Krishna's Sri Sri movie audio launch. This audio launch will be helding at Hyderabad Shilpa Kala Vedika on February 19th.