పూరీ- ప్రిన్స్‌ల సినిమా 'జనగణమనే'నా?

Mahesh Babu movie with Puri Jagannadh

09:27 AM ON 25th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu movie with Puri Jagannadh

‘పోకిరీ’తో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన పూరీ జగన్నాథ్ మళ్ళీ ప్రిన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్‌మేన్’ ఫిల్మ్ సోసోగా ఆడింది. తరువాత వీళ్ళిద్దరితో సెల్యులాయిడ్‌ పై మ్యూజికల్ హిట్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ‘జన గణ మన’ టైటిల్ మహేష్ కోసమే రిజిస్టర్ చేశానని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ పూరీ నుంచి మరో హిట్ రాబోతోందనే గట్టి హోప్స్‌ పెట్టేసుకున్నారు. అయితే ఇంతలోనే ఓ నిట్టూర్పు... కారణం మహేష్‌తో కొత్త ప్రాజెక్ట్, అదీ మురుగదాస్‌తో సినిమా పూర్తి తర్వాతేనన్న విషయం తెలుసుకున్న తరువాత ఇంత గ్యాప్ భరించడం కష్టమేనని అభిమానులు అంటున్నారు.

అందులోనూ ‘బ్రహ్మోత్సవం’ అనుకున్న రేంజ్‌లో హిట్ కాకపోవడంతో మహేష్ నెక్ట్స్ మూవీ రిస్క్ లేకుండా ఉండేలా చూసుకుంటున్నాడని టాక్. అంటే పూరీ-మహేష్‌తో మూవీ తీయడం ఇంకొంతకాలం పడుతుందనే కామెంట్ వినిపిస్తోంది. మొత్తానికి 'బ్రహ్మోత్సవం' దెబ్బ నుంచి కోలుకోవడం కొంచె కష్టమే మరి.

English summary

Mahesh Babu movie with Puri Jagannadh