వంశీ పైడిపల్లితో సూపర్ స్టార్

Mahesh Babu Movie With Vamshi Paidipally

10:46 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Mahesh Babu Movie With Vamshi Paidipally

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత, మాంచి హిట్ కోసం మురుగుదాస్ తో జత కట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త మూవీపై కూడా దృష్టి పెట్టాడు. వాస్తవానికి, ఒక సినిమా చేస్తున్నపుడే, మహేష్ బాబు తర్వాతి ప్రాజెక్టును ఫైనలైజ్ చేసేస్తుంటాడు. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్స్ ఏమీ చేయకపోయినా, ఫీలర్లు మాత్రం వచ్చేస్తాయి. ఒక సినిమా కంప్లీట్ అయ్యనాటికే తర్వాతి మూవీ ప్రారంభానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయేలా జాగ్రత్తపడతాడు. డైరెక్టర్లు లేట్ చేస్తే మినహా, లేకుంటే మహేష్ సినిమాలు చకచకా వచ్చేస్తుంటాయి.

ఇక ముందు చెప్పినట్టు, ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తర్వాతి సినిమా ఎవరికి చేయబోతున్నాడో ఓ క్లూ వదిలాడు. అదేమంటే, మహేష్ బాబుకి బర్త్ డే సందర్భంగా, విషెస్ చెబుతూ పీవీపీ సినిమా వాళ్లు ఓ పోస్టర్ వేశారు. ఈ పోస్టర్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు కూడా మెన్షన్ చేశారు. దీన్ని బట్టి మహేష్ తర్వాతి సినిమా పైడిపల్లితో చేయనున్నాడని చెప్పవచ్చు.

ఇప్పటికే మహేష్ కి ఓ స్టోరీలైన్ చెప్పి వంశీ పైడిపల్లి ఓకే చేయించుకున్నాడనే టాక్ ఉంది. సూపర్ స్టార్ తో సినిమా కోసమే అఖిల్ ని కూడా కాదనుకున్నాడని అంటారు. ఇప్పుడు పీవీపీ బ్యానర్ పై ఓ పోస్టర్ వచ్చేసి తగినంత సరుకు ఇచ్చేసింది. మురగదాస్ తో సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితోనే చేస్తాడని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ హీరోతో తాప్సీ ఎఫైర్.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:కామెడీ ట్రాక్ తో 'మిక్చర్ పొట్లం'

English summary

Super Star Mahesh Babu was presently acting in a movie under the direction of A.R. Murugadoss and now on behalf of Mahesh Babu birthday PVP announced a movie with Mahesh Babu and the movie was going to direct by Vamshi Paidipally.