సూపర్ స్టార్ సినిమాకు ఆషాఢం అడ్డంకి?

Mahesh Babu Murugadoss New project Delayed

11:30 AM ON 1st July, 2016 By Mirchi Vilas

 Mahesh Babu Murugadoss New project Delayed

ముహూర్తాలు చూసుకుని మరీ సినిమావాళ్లు షూటింగ్ స్టార్ట్ చేస్తారని అందరికీ తెలిసిందే. ఇక మహేష్ బాబు న్యూప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అదిగో ఇదిగో అంటూ రెండునెలలుగా వార్తలొచ్చాయి. ఇందులో ప్రిన్స్ పక్కన పరిణీతి చోప్రా హీరోయిన్. ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ స్కెచ్ వేశారు. ఇక్కడ ఐదురోజుల పాటు ఓ సాంగ్ ని షూట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారట. ఖర్చు కూడా ఆ రేంజ్ లో పెడుతున్నారట. ఆ తర్వాత టీమ్ పూణె వెళ్లనుంది. ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరగనుందని తెలుస్తోంది. హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందించనున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ఇంకా ఫిక్స్ కాలేదు.

అయితే చెన్నై నుంచి అందుతున్న టాక్ ని బట్టి షూట్ వచ్చేనెల 29 నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్. ఈ డిలే కి కారణం ఏమిటో ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇచ్చినట్టు లేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. స్టోరీలో మార్పులు చేర్పులు అని చెబుతున్నప్పటికీ అసలు రీజన్ వేరేగా వుందట. ఇక 29న సెట్స్ పైకి వెళ్తుందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే అప్పటివరకు ఆషాడం వుంటుందని ప్రిన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అంటే ఆషాఢం అడ్డంకిగా నిలిచిందా? మొత్తానికి అడ్డంకులు అధిగమించి షూటింగ్ చేసేసి, ఆగష్టు సెకండ్ వీక్ గ్యారెంటీ అని మరో టాక్ నడుస్తోంది. వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో వున్నారు.

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: ఎత్తు పెరగాలంటే ఇవి తినాల్సిందే

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

English summary

Mahesh Babu Murugadoss New project Delayed.