ప్రిన్స్ లుక్ అదుర్స్ - అంతా మురుగా మహిమ

Mahesh Babu new look

11:37 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Mahesh Babu new look

ఒకప్పడు సినీ హీరోల స్టైల్ అప్పుడప్పుడు మారేది. మరి ఇప్పుడు సినిమా సినిమాకు హీరోలు స్టైల్ ని మార్చేస్తున్నారు. లేకపోతే ప్రేక్షకుడికి నచ్చడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు మహేష్ బాబు కూడా తన కొత్త సినిమాకు మళ్లీ కొత్తగా కనిపించబోతున్నాడని ఫిలింనగర్ లో హాట్ న్యూస్ హడావుడి చేస్తోంది. ఈసారి గెడ్డంలో కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. పైగా ఎన్నో అంచనాలతో విడుదలైన బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ అవ్వడంతో, తదుపరి అలాంటివి రిపీట్ కాకూడదని మహేష్ అనుకుంటున్నాడట. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మురుగదాస్ డైరక్షన్ లో తెరకెక్కే సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తాడట. అందులో ఒకటి మాస్ అయితే ఇంకొకటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని తెలుస్తోంది. మాస్ లుక్ ని ఇప్పుడే రివీల్ చేయడం దర్శకుడికి ఇష్టం లేదట. అందుకే క్లాస్ లుక్ కి సంబంధించి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఎప్పుడూ సైడ్ గా హెయిర్ ని దువ్వే మహేష్ ఈ ఫోటోషూట్ లో బ్లేజర్ వేసుకొని, జుత్తును కాస్త పైకి దువ్వి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ని చూపిస్తున్నాడు. అయితే ఈ ఫోటో సినిమాకు సంబంధించి కాదని కొందరు అభిమానులంటున్నారు. ఇది ఓ యాడ్ షూటింగ్ కోసం తీసిందంటున్నారు.

ఏది ఏమైనా ఈ కొత్తలుక్ బాగుందని అందరూ ఓకే చేయడంతో మురుగదాస్ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లుక్ ఇలా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

English summary

Mahesh Babu new look