మహేష్ కొత్త సినిమా టైటిల్ కన్ఫర్మ్

Mahesh Babu new movie title Agent Siva

02:33 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Mahesh Babu new movie title Agent Siva

'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత కసిగా మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సినిమా టైటిల్ నైతే ఖరారు చేయలేదు కానీ, దానిపై రకరకాల కథనాలు వినిపించాయి. ఒకానొక దశలో అభిమన్యుడు అన్న టైటిల్ ను పెట్టారన్న వార్తలు వినిపించాయి. కానీ, ఆ పేరును మాత్రం పెట్టలేదు. తాజాగా ఆ సినిమా టైటిల్ కు సంబంధించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఏజెంట్ శివ' అన్న టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. సినిమాలో నిఘా విభాగం(ఐబీ) అధికారిగా కనిపించే మహేష్ పేరు శివ అని టాక్. ఓ కేసుకు సంబంధించిన చిక్కు ముడులను విప్పుతాడట మహేశ్.

అందుకే సినిమాకు ఏజెంట్ శివ అన్న పేరుకే చిత్ర బృందం అంతా ఓకే చేసిందట. చిత్ర యూనిట్ ఓకే చేసేసింది కాబట్టి.. అదే ఫైనల్ చేశారని చెబుతున్నారు. మరి అసలు టైటిల్ ఏంటి అన్నది తెలియాలంటే.. మరో రెండు వారాలు ఆగితే టైటిల్ కన్ ఫ్యూజన్ కు తెరపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీపావళి పండుగ సందర్భంగా మహేశ్ ఓ పది సెకన్ల టీజర్ ను విడుదల చేస్తాడట. ఒకవేళ ఆ టీజర్ లో ఏమైనా సినిమా టైటిల్ తెలిసే అవకాశం ఉంటుందేమోనని అంటున్నారు. వేచిచూద్దాం.

English summary

Mahesh Babu new movie title Agent Siva