బావ నటన సూపర్బ్...

Mahesh Babu Praises Sudheer Babu For Bhagi

10:39 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu Praises Sudheer Babu For Bhagi

టాలీవుడ్‌లో విజయం సాధించిన వర్షం చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘బాఘీ’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో విలన్‌ ‘రాఘవ్‌’ పాత్రను టాలీవుడ్‌ నటుడు సుధీర్‌ బాబు నటించాడు . బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా రూపొందిన చిత్రం బాఘీ చిత్రానికి సబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించగా, సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరించారు. సుదీర్ పాత్రకు సంబంధించిన వీడియోను బాఘీ చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంట్లో సుధీర్‌బాబు కండలు తిరిగిన దేహంతో ఉన్నాడు. ఈ ట్రైలర్‌ను చూసిన మహేశ్‌బాబు వెంటనే సుధీర్‌ను ప్రశంసించాడు.. అందులో సుధీర్‌బాబు ప్రదర్శన అద్భుతంగా ఉందని.. అతన్ని చూస్తూంటే గర్వంగా ఉందని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేసాడు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెల్పాడు. హీరో టైగర్‌కి సరిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు సుధీర్‌బాబును విలన్‌గా ఎంచుకున్నారు. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

English summary

Sudheer Babu was recently acted in a film called Bhagi in Bollywood. He acted as Vilasn in the movie and Super Star Mahesh Babu Praised Sudheer Babu For his acting in Bhagi Movie. This Movie was going to be release on this friday.