'తను-నేను' అంటున్న మహేష్

mahesh babu promotes thanu-nenu movie

03:47 PM ON 25th November, 2015 By Mirchi Vilas

mahesh babu promotes thanu-nenu movie

ఈ నెల 27న తెలుగులో రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అందులో అనుష్క నటించిన 'సైజ్‌ జీరో' ఒకటి, మరొకటి సంతోష్‌ శోభన్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన 'తనునేను' ఒకటి. ఇందులో సైజ్‌జీరో కి అంతగా పబ్లిసిటి అవసరం లేదు. ఎందుకంటే ఇందులో స్టార్‌ హీరో ఆర్య, స్టార్‌ హీరోయిన్లు అనుష్క, సోనాల్‌ చౌహాన్ నటించడం ఒకటైతే, కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించారు. కాబట్టి ప్రేక్షకులు ఈ చిత్రం పై మొగ్గు చూపుతారు. కాని 'తను-నేను' లో స్టార్‌ హీరోహీరోయిన్లు ఎవరూ లేరు కాబట్టి దీనికి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రమోట్ చేస్తున్నారు.

మహేష్‌బాబు తో 'బాబీ', ప్రభాస్‌ తో 'వర్షం' వంటి చిత్రాలు తీసిన దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌ 'తను-నేను' చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్‌ శోభన్‌కి మహేష్‌బాబుకి ఉన్న పాత పరిచయం గుర్తు చేసుకుంటూ మహేష్‌ 'తనునేను' టీమ్‌కి విషస్ చెప్పి తను సపోర్ట్‌ని తెలియజేశాడు. స్వర్గస్తులైన శోభన్‌తో పనిచేసిన జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. ఆయన కుమారుడు శోభన్‌ యాక్టింగ్‌ని తన కెరీర్గా ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా అని మహేష్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

English summary

Super Star Mahesh Babu supporting for Thanu-Nenu movie team, and wished the team with kind heart.