సైమాకు థ్యాంక్స్ చెప్పేసిన శ్రీమంతుడు

Mahesh Babu Says Thanks To SIIMA

11:49 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Mahesh Babu Says Thanks To SIIMA

శ్రీమంతుడు సినిమాకు ఇప్పటికే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సైమా అవార్డులకు సంబందించి బెస్ట్ యాక్టర్ అవార్డు పొందాడు. అందుకే సైమాకు థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్ళిన మహేష్ ఇటీవల సింగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు.

తన సన్నిహితుల ద్వారా ఈ అవార్డు అందిందని, ఇందుకు సైమాకు కృతజ్ఞతలని మహేష్ ట్వీట్ చేశాడు. త్వరలో సూపర్ స్టార్ విదేశాలనుంచి తిరిగి రాగానే ఎ.ఆర్.మురుగదాస్ తో చేయబోయే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నాడు. కాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ బాబు డ్యుయల్ రోల్ లో నటించవచ్చునని అంటున్నారు. ఒక రోల్ లో ఇంటలిజెన్స్ అధికారిగా..మరో పాత్రలో ప్రొఫెసర్ గా యాక్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి బ్రహ్మోత్సవం డిజాస్టర్ నుంచి కోలుకోడానికి అవార్డు లు బానే వస్తున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు.

English summary

Recently Tollywood Super Star Mahesh Babu was awarded with Best Actor in SIIMA Awards and Mahesh Babu thanked SIIMA tfor giving his that Prestigious Award.