వాళ్ళను తిట్టకండి ... తప్పు నాదే

Mahesh Babu Says That Not To Blame Srikanth Addala

02:51 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Says That Not To Blame Srikanth Addala

బ్రహ్మోత్సవం సినిమా అభిమానులకే కాదు, సినిమా యూనిట్ కి కూడా చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యే మహేష్ ని కించపరుస్తూ కథనం రాసారని ఇండియన్ ఎక్సప్రెస్ దినపత్రిక ఆఫీసుకి ఫోన్ చేసి మొదట బూతులు తిట్టిన మహేష్ అభిమానులు, ఆ తరువాత దినపత్రిక కార్యాలయాన్ని ముట్టడించి, ఆ కథనాన్ని రాసిన రచయితను ఉద్యోగం లోంచి సంస్థ తీసేసేంతవరకు నిద్రపోలేదు.

ఇక బాలత్రిపురమణి సాంగ్ లో మహేష్ చేసిన డ్యాన్సులను అందరు హేళన చేస్తుండటంతో ఆ సాంగ్ కి నృత్యాలు సమకూర్చిన దినేష్ మాస్టర్ ని కూడా మహేష్ ఫ్యాన్స్ అనరాని మాటలన్నారట . అక్కడితో ఆగకుండా శ్రీకాంత్ అడ్డాలకి కూడా ఫోన్ చేసి తిట్టేస్తున్నారట. అందుకే మహేష్ బాబు స్వయంగా ఫ్యాన్స్ తో మాట్లాడాల్సి వచ్చింది.

శ్రీకాంత్ అడ్డాలను ఏమి అనొద్దని, సినిమా ఆడనందుకు పూర్తి బాధ్యత తనదే, ఈ సినిమా చేయడం కూడా తన తప్పే అని లండన్ కి వెళ్ళేముందు కొంతమంది సినియర్ అభిమానులతో, మహేష్ అన్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి:స్పీల్బర్గ్ సినిమాకు పనిచేయనున్న జగపతిబాబుకమీడియన్

ఇవి కూడా చదవండి:'సప్తగిరి' పారితోషికం ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Super Star Mahesh Babu said to his fans that no to blame Director Srikanth Addala for Brahmotsavam Movie. He said that was his fault to do this movie.